ప్రేమికుల రోజున బాలీవుడ్ సెలబ్రిటీకి పెళ్లి
బాలీవుడ్లో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లకు కొదవ లేదు. గత ఏడాదంతా వారి వివాహాలతోనే సందడి నెలకొంది. ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా గాయిని, బాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లికి సిద్ధమయ్యారు. గాయని నీతి మోహన్ బాలీవుడ్ నటుడు నిహార్ పాండే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రేమికుల రోజున వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న వీరిద్దరూ ఈ విషయాన్ని సృష్టం చేశారు. నిహార్ని ప్రత్యక్షంగా చూడకుండానే ప్రేమించాను. నిహార్ మాట్లాడుతూ అసామా (ఇండియన్ పాప్ గ్రూప్)లో ఒకరు మా స్నేహితుడు ఉండేవాడు. అసామా ద్వారానే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. ఆమెను నాకు పరిచయం చేయమని చాలాసార్లు అతన్ని అడిగాను. కానీ ఎప్పుడూ పరిచయం చేయలేదు. ఏడాది క్రితం గోవాలో మా స్నేహితుడు వివాహంలో అనుకోకుండా ఆమెను కలిశాను. అప్పటి నుంచి మా ప్రేమ మొదలైంది అని అన్నారు. నిహార్ గతంలో దీపికా పదుకొనేతో ప్రేమాయణం నడిపారు.













