వడ్డీలోడు వచ్చెనే…
గజని, సింగం చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య. 7జి బృందావన కాలని ఫేమ్ శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎస్ జి కె (నంద గోపాల కృష్ణ). ఖాకి వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, రిలయన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తొలి పాట వడ్డీలోడు వచ్చెనే పాటని విడుదల చేశారు. సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శివకుమార్.













