Allari Naresh: అల్లరి నరేష్ సినిమాకు కొత్త సెంటిమెంట్
కెరీర్ మొదట్లో ఎక్కువగా కామెడీ మూవీస్ చేసిన అల్లరి నరేష్(allari naresh), ఆ తర్వాత గమ్యం(Gamyam), శంభో శివ శంభో(Sambjo shiva sambho) లాంటి సినిమాలు కూడా చేశాడు. ఈ మధ్య కాస్త రూట్ మార్చి సీరియస్, థ్రిల్లర్ సినిమాలు కూడా చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న నరేష్ తాజాగా 12ఎ రైల్వే కాలనీ(12A railway colony) అనే మూవీ చేయగా ఈ సినిమాతో నాని కాసరగడ్డ(nani kasaragadda) డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
ఆల్రెడీ రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పొలిమేర(polimera) డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్(anil viswanath) షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి(srinivas chitturi) నిర్మించగా, కామాక్షి భాస్కర్ల(Kamakshi bhaskarla) హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడో హిట్ సెంటిమెంట్ ఉందని రీసెంట్ గా అల్లరి నరేష్ బయటపెట్టాడు.
గతంలో శ్రీనివాస్ తో కలిసి తాను నా సామిరంగ(naa samiranga) మూవీ చేశానని, ఆ సినిమా చేస్తున్నప్పుడు తన కాలికి దెబ్బ తగిలిందని, ఈ విషయాన్ని నిర్మాతకు చెప్తే అది తనకో సెంటిమెంట్ అని, తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిందని.. ఇప్పుడు 12ఎ రైల్వే కాలనీ చేస్తున్నప్పుడు కూడా తన భుజానికి గాయమైందని, సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నరేష్ చెప్పగా, ఇది విన్న నెటిజన్లు ఇదేం విడ్డూరమని కామెంట్స్ చేస్తున్నారు.






