డిసెంబర్లో నయన పెళ్లి ?
ఒకవైపు తెలుగు సినిమాలతోనూ, మరో వైపున తమిళ సినిమాలతోనూ నయనతార పుల్ బిజీగా ఉంది. భారీగా పారితోషికం పెంచేసినా ఆమెకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం తగ్గడం లేదు. దాంతో నయనతారకి ప్రత్యామ్నాయం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాగే ఈ డిసెంబర్లో ఆమె వివాహం విఘ్నేశ్ శివన్‌తో జరగనుందనే టాక్ కూడా అక్కడ బలంగా వినిపిస్తోంది. నయనతార, విఘ్నేశ్ శివన్ చాలా కాలంగా ప్రేమలో వున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూనే, ఏ మాత్రం తీరిక దొరికినా విదేశాల్లో వివహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఈ డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సారైనా వీళ్లు ఈ ప్రచారాన్ని నిజం చేస్తారో.. లేదంటే ఎప్పటిమాదిరిగానే చెట్టాపట్టాల్తోనే సరిపెడతారో చూడాలి.













