మిడిల్ ఏజ్ మహిళగా అనుష్క శెట్టి హీరోగా నవీన్ పోలిశెట్టి
అనుష్క గ్లామర్ ని చూపిచిన మూవీస్ తక్కువే వచ్చాయి. అంతే కాదు, ఆమెతో మంచి రోమాంటిక్ మూవీ తీయాలన్న ఆలోచన అప్పట్లో డైరెక్టర్లకు ఎందుకో రాలేదు అనిపిస్తుంది. ఇన్నేళ్ల తరువాత అలాంటి ఆలోచనను చేస్తున్నారు యూవీ నిర్మాణ సంస్థ వారు. ఈ మూవీ పూర్తిగా కొత్త కోణంలో ఉంటుంది అంటున్నారు. ఈ మూవీలో అనుష్క నడి వయసులో పడిన ప్రౌఢగా కనిపిస్తుందిట. ఆమె తో లవ్ ట్రాక్ నడిపే పాతికేళ్ల యువకుడిగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యన మంచి రొమాంటిక్ కంటెంట్ ని అల్లుకుని మేకర్స్ ఫ్రెష్ గా మూవీని ఆడియన్స్ ముందుంచబోతున్నారుట. ఈ మూవీ స్టోరీ మాత్రం ఇంటెరెస్టింగ్ గానే ఉంది. దీన్ని తెర మీద చక్కగా తీస్తే మాత్రం అనుష్క ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడడమే కాదు, ఆమెతో లేడీ ఓరియెంటెండ్ మూవీస్ నే చేయాలని డిసైడ్ అయిపోయిన చాలా మంది ఆలోచనల్లో మార్పు వస్తుంది అంటున్నారు. మొత్తానికి అనుష్క న్యూ మూవీ కంటెంట్ ఇదీ అని వస్తున్న న్యూస్ మాత్రం నిజమైతే ఇది టాలీవుడ్ కి కూడా కొత్త జానర్ లో మూవీ అవుతుంది అని చెప్పవచ్చు.













