ఊహించని విధంగా నాని సినిమా బిజినెస్
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమా కోసం నాని తన కంఫర్ట్ జోన్‌ని వదిలేసి మరీ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. నానికి ఇదే ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఇందులో నాని మొదటిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ చేసినట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి దసరా సినిమా 50 కోట్ల వరకూ బిజినెస్ అయిందని టాక్. ఓవర్సీస్ కాకుండా థియేటర్ హక్కులు 25 కోట్లకు పైగా పలికినట్లు వార్తలొస్తున్నాయి.
ఓవర్సీస్ కూడా కలిపితే సినిమా మొత్తం 80-85 కోట్ల మేరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇది నాని కెరీర్లోనే హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు గత కొంతకాలంగా నాని గ్రాఫ్ చూసుకుంటే ఈ బిజినెస్ అసలు ఎవరూ ఊహించనిదనే చెప్పాలి. రీసెంట్గా తెలుగు సినిమా మార్కెట్ పెరగడమే దీనికి కారణం అని అర్థమవుతోంది.













