ఆ అవకాశాన్ని పూజా లాగేసుకుంది
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్‌కి రానన్ని అవకాశాలు పూజా హెగ్డేకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్స్‌లు కొట్టేస్తోన్న ఈ అమ్మడు నాన్ స్టాప్‌గా పెద్ద సినిమాలు అంగీకరిస్తూ దూసుకెళ్తుంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న బంగార్రాజు లో మొదట ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ని లేదా కాజల్ అగర్వాల్‌ని హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. చివరికీ ఆ అవకాశాన్ని పూజా హెగ్డే లాగేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ భామతో ఈ చిత్ర బృందం సంప్రదింపులు కూడా జరిపిందట. త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. మరి నాగార్జున సరసన పూజా హెగ్డే ఏ రేంజ్లో నటిస్తోందో చూడాలి.













