అఖిల్ కోసం నాగ్ డెసిషన్
అఖిల్ హీరోగా ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో అఖిల్ ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైమ్ తీసుకుని, ఏజెంట్ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి అందరిలో గందరగోళం నెలకొంది.
ఏ జానర్ ప్రయత్నించినా అఖిల్ కు ఇప్పటి వరకు సాలిడ్ హిట్ పడలేదు. అందుకే ఈసారి తన తండ్రి చెప్పినట్లు చేయాలని డిసైడయ్యాడట అఖిల్. ఫస్ట్ రెండు మూవీల విషయంలో అఖిల్ కు సపోర్ట్ గా ఉన్న నాగ్, ఆ రెండు సినిమాలు మంచి ఫలితాన్నివ్వకపోవడంతో డెసిషన్ అఖిల్ కు వదిలేశాడట. అప్పుడే అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో హిట్ పడింది.
ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఏజెంట్ సినిమాను పట్టాలెక్కించిన అఖిల్, ఏజెంట్ తో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఏజెంట్ డిజాస్టర్ అయినా సరే ఈ మూవీ కోసం అఖిల్ పడ్డ కష్టానికి అందరూ అఖిల్ ని మెచ్చుకుంటున్నారు. అయితే ఇకపై అఖిల్ తర్వాతి సినిమాల విషయంలో మాత్రం టార్గెట్ మిస్ అవకూడదనే ఆలోచనతో స్టోరీ డిస్కషన్స్ లో నాగ్ కూడా ఇన్వాల్వ్ అవాలని డిసైడయ్యాడట. అంతేకాదు అఖిల్ ఇకపై నటించే సినిమాలకు అన్నపూర్ణ బ్యానర్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుందని తెలుస్తోంది. అలా అయితే బడ్జెట్ తగ్గి, సినిమా రిజల్ట్ లో తేడా వచ్చినా పెద్దగా లాస్ ఉండదని నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.













