మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగచైతన్య?
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కొత్త చిత్రం థాంక్యూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతుండగా..చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చైతు అభిమానులతో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు శుభవార్తే. ఈ చిత్రంలో చైతు మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు అభిరామ్‌గా కనిపించనున్నాడు. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీవీఎస్ రవి సమకూర్చిన కథను దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్ మరో కథానాయికగా కనిపించనుంది. చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.













