Nag Ashwin: సీనియర్ డైరెక్టర్ తో నాగ్ అశ్విన్ సినిమా?
టాలీవుడ్ లోని మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో నాగ్ అశ్విన్(nag ashwin) కూడా ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం(Yevade Subramanyam) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నాగి(Nagi), ఆ తర్వాత మహానటి(mahanati) మూవీతో తన స్టామినా ఏంటో అందరికీ తెలియచేశాడు. గతేడాది కల్కి2898ఏడీ(Kalki2898AD) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ్ అశ్విన్ ఆ సినిమాతో తన స్థాయిని విపరీతంగా పెంచుకున్నాడు.
నాగ్ అశ్విన్ ఓ వైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ ఆడియన్స్ ను చేరువగా ఉంటున్నారు. ఆల్రెడీ జాతి రత్నాలు(jathiratnalu) మూవీతో సినిమాను చేసి ఆ మూవీతో భారీ బ్లాక్బస్టర్ ను అందుకున్న నాగి, ఇప్పుడు మరో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు(Singeetham Sreenivasarao) దర్శకత్వంలో నాగి ఓ సినిమాను నిర్మించబోతున్నాడట.
డైరెక్టర్ గా సింగీతం చేయని ఎక్స్పెరిమెంట్స్ లేవు, ఆయన చేయని జానర్ లేదు. సింగీతం డైరెక్షన్ అంటే ఎంతోమంది ఇష్టం. ఆయన డైరెక్షన్ ను ఇష్టపడే వారిలో నాగి కూడా ఒకడు. సింగీతంపై నాగికి ఉన్న స్పెషల్ అభిమానం వల్లే వారిద్దరూ కలిసి మహానటి, కల్కి సినిమాలకు వర్క్ చేశారు. సింగీతం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నాగి ఎప్పట్నుంచో అనుకుంటుంటే ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టు ముందుకు కదిలిందని, ఈ సినిమాలో అంతా కొత్త వాళ్లే నటిస్తారని, ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) సంగీతం అందించనున్నాడని సమాచారం.






