Nag Ashwin: ప్రభాస్ ఇప్పటివరకు ఏదీ రిపీట్ చేయలేదు
బాహుబలి(baahubali) సినిమాతో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas). ఆ సినిమా తర్వాత వివిధ జానర్లలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. సాహో(saaho), ఆదిపురుష్(adhipurush), సలార్(salaar), కల్కి(kalki) ఇలా ప్రతీ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూనే వెళ్లారు. స్టార్ హీరోలందరూ ఒక్కో సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటుంటే డార్లింగ్(darling) మాత్రం సంవత్సరానికో సినిమా చొప్పున రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆనందింప చేస్తున్నాడు.
ఆఖరిగా కల్కి(kalki 2898AD) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభాస్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకున్నాడు. నాగ్ అశ్విన్(nag ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా కల్కి2(kalki2) కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే రీసెంట్ గా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో ప్రభాస్ గురించి, అతనితో వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ గురించి యాంకర్ అడిగింది.
దానికి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ప్రభాస్ లో రెండు సైడ్స్ ఉన్నాయని, మొదటిది చాలా ఫ్రెండ్లీగా, లైట్ హార్టెడ్ గా ఉంటే, రెండో సైడ్ మాత్రం సినిమా అంటే పిచ్చి అని, ఎలాంటి సినిమానైనా ఆయన ఎంజాయ్ చేస్తూ చేస్తారని, మూవీస్ విషయంలో ఆయన చాలా స్మార్ట్ అని, అతని ఫిల్మోగ్రఫీ చూస్తే ఇప్పటిదాకా ప్రభాస్ ఏదీ రిపీట్ చేయలేదని, ప్రతీ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని, ఇప్పటికే ప్రభాస్ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చాలా చేశారని, చాలా చిన్న వయసులోనే ప్రభాస్ చక్రం(chakram) లాంటి సినిమాను చేశారని నాగ్ అశ్విన్ చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
https://x.com/FilmyBowl/













