అజిత్ పైనే ఆధారపడ్డ మైత్రీ నిర్మాతలు
తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) రూపొందిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమా షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. కానీ ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందా లేదా అనే విషయంలో ఏర్పడ్డ సందిగ్దత మాత్రం ఫ్యాన్స్ ను అయోమయంలో పడేస్తుంది. దానికి కారణం అజిత్ విదాముయార్చి(Vidamuyarchi) ఇంకా రిలీజ్ కాలేదు.
దసరాకు రిలీజ్ అన్నారు. వీలు కాలేదు. దీపావళి అన్నారు. ఇప్పుడు కూడా రిలీజ్ కావడం లేదు. నవంబర్ లో ఏమైనా రిలీజవుతుందా అంటే సూర్య(Suriya) కంగువ(Kanguva) ఉంది సో మిగిలింది డిసెంబరే. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న లైకా(Lyca) సంస్థ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ప్రెజర్ కారణంతో విదాముయార్చిని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తోందట.
అదే నిజమైతే గుడ్ బ్యాడ్ అగ్లీని పోస్ట్‌పోన్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై ప్రస్తుతం మైత్రీ నిర్మాతలు అజిత్ చెప్పే మాట కోసం ఎదురుచూస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. సంక్రాంతి సీజన్ లో సినిమాను రిలీజ్ చేస్తే తెలుగుతో పాటూ తమిళంలో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఏదేమైనా అజిత్ మాటపై గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది.













