Mythri Movie Makers: ఆ సినిమాలకు ప్రమోషన్స్ లేవేంటి!
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఇప్పుడు తమ మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులేస్తుంది. అందులో భాగంగానే ఇతర భాషల్లో సినిమాలు చేసి అక్కడ కూడా జెండా పాతాలని చూస్తున్నారు నిర్మాతలు నవీన్(Naveen), రవిశంకర్(Ravi Shankar). ఈ క్రమంలోనే బాలీవుడ్ లో సన్నీ డియోల్(Sunny Deol) తో జాట్(Jaat), కోలీవుడ్ లో అజిత్(Ajith) తో గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాలు చేశారు.
జాట్ తో బాలీవుడ్ లోకి, గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని మైత్రీ నిర్మాతలు ప్లాన్ చేసి సినిమాలు చేశారు. ఎప్పుడూ ప్రమోషన్స్ అంటే ముందుండే మైత్రీ సంస్థ ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. అందుకే రేపు ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే విషయం కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియలేదు.
అయితే ఈ సినిమాలకు మేకర్స్ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఆయా సినిమాల్లో నటించిన ప్రధాన నటులేనని తెలుస్తోంది. ప్రమోషన్స్ పై వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని, దీంతో చేసేదేమీ లేక సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారట నిర్మాతలు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఆయా భాషల్లో బాగా వర్కవుట్ అయితే తప్పించి పెట్టిన పెట్టుబడులు తిరిగి వెనక్కి రావు. మరి ఈ సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ ఎలాంటి ఫలితాల్ని అందుకుంటుందో చూడాలి.













