Thaman: సినిమాలను చంపొద్దని వేడుకుంటున్న తమన్
సోషల్ మీడియా వచ్చాక రోజురోజుకీ నెగటివిటీ బాగా పెరిగిపోతుంది. వందల కోట్లు పెట్టి తీసిన పాన్ ఇండియా సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ బాగా ఎక్కువైంది. హీరోలు అలాంటివి చేయొద్దని ఎంత మొత్తుకున్నా సరే ఫ్యాన్స్ మాత్రం అవి వినే స్థాయిని ఎప్పుడో దాటిపోయారు. ఆ నెగిటివిటీని పెంచడం ఏదో పెద్ద గొప్ప పనిలా భావించి మరీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డాకు మహారాజ్(Daku Maharaj) సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ఈ విషయంపై స్పందించాడు. సినిమాలను చంపొద్దని బహిరంగంగా వేడుకున్నాడు. సక్సెస్ ఇచ్చే ఆనందమే వేరని కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ప్రచారాలు చేసి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని అందరినీ కోరాడు. అయితే ఇక్కడ తమన్ చెప్పింది అందరూ ఆలోచించాల్సిన విషయమే.
గత కొన్ని నెలలుగా ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది. కల్కి, దేవర నుంచి రీసెంట్గా వచ్చిన గేమ్ ఛేంజర్ వరకు అన్ని సినిమాలను యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ఆనందిస్తున్నారు. నెగిటివ్ ట్రెండ్స్ వల్ల తీవ్ర మనస్థాపం కలుగుతుందని, నిర్మాతలను గౌరవించడం మన కనీస బాధ్యతని తమన్ చాలా మంచి విషయాలు చెప్పాడు. ట్రోల్స్ ను మొగ్గ స్థాయిలోనే తుంచేస్తే బెటరనేది తమన్ అభిప్రాయం. మరి తమన్ మాటలకు నెటిజన్లలో ఏమైనా మార్పొస్తుందేమో చూడాలి.













