Thaman: పెళ్లి చేసుకోవద్దంటున్న తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) తనకంటూ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. తానెప్పుడూ సూటిగా మాట్లాడుతూ, తాను చెప్పాలనుకున్నది అసలు మొహమాట పడకుండా క్లారిటీగా చెప్తాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో సినిమాలపై నెగిటివ్ రివ్యూలు, కామెంట్లు చేసే వారిపై తమన మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేశాయి.
తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి, వివాహ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా తనను అడిగితే పెళ్లి చేసుకోవద్దనే చెప్తానని చెప్పిన తమన్, దానికి గల కారణాలను కూడా వివరించాడు. ఈ రోజుల్లో ఇద్దరు కలిసి ఉండటానికి పెళ్లి చాలా కష్టంగా మారుతుందని, లైఫ్ లో అమ్మాయిలు కూడా స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారన్నాడు.
ఎవరూ ఒకరి కింద బతకాలనుకోవడం లేదని, కోవిడ్ తర్వాత అందరి ఆలోచనా విధానాలు మారిపోయారని, అందరి జీవన విధానంలో ఊహించని మార్పులొచ్చాయని తమన్ అన్నాడు. జనాల్ని ఇన్‌స్టాగ్రమ్(Instagram) చాలా చెడగొడుతుందని, కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే మనం ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నామని, కానీ దాని వెనుక ఉండే స్ట్రగుల్ ను దాచేస్తున్నామని, అందరూ మ్యారేజ్‌లో పాజిటివ్ యాంగిల్ ను మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తున్నారని, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోవడంతోనే మ్యారేజ్ సిస్టమ్ అందరికీ చాలా టఫ్ గా మారిపోయి, పెళ్లైన కొద్ది రోజులకే డైవర్స్ తీసుకుంటున్నారని, పెళ్లిని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఈ తరానికి లేదని తమన్ తెలిపాడు.













