మహేష్‌ను ఇంప్రెస్ చేయడానికి థమన్ కష్టాలు
గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ, స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాకు ఏదొక రూపంలో అవాంతాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా తప్పుకోవడంతో నెట్టింట ఈ సినిమా గురించి పెద్ద చర్చలే జరిగాయి. పూజాతో పాటూ ఈ సినిమా నుంచి థమన్ కూడా తప్పుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనికి కారణం థమన్, మహేష్ మధ్య ఏవో అభిప్రాయ బేధాలున్నాయని వార్తలొచ్చాయి. కానీ త్రివిక్రమ్ మహేష్ ను ఒప్పించడంతో ఆ చర్చలు సైలెంట్ అయ్యాయి. గుంటూరు కారం సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఏ ఫ్యాన్స్ ఎదురుచూడనంతగా మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే థమన్ కూడా ఈ సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడని తెలుస్తోంది.
గుంటూరు కారం ఆల్బమ్ తో మహేష్ తో పాటూ మహేష్ ఫ్యాన్స్ ను కూడా ఇంప్రెస్ చేయాలని థమన్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను ఇప్పటికే ముగ్గురు నలుగురితో పాడించాడు. రీసెంట్గా ఇదే ట్యూన్‌ని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన శేఖర్ తో పాడించినట్లు తెలుస్తోంది. అన్ని వెర్షన్స్ లో శేఖర్ పాడిన వెర్షనే బయటకు రిలీజ్ కానుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. మ్యూజిక్ విషయంలో థమన్, త్రివిక్రమ్ తెగ కష్టపడుతున్నారు. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ చాలా ప్రయత్నిస్తున్నాడు.













