AKhanda2: అఖండ2 ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య(balayya) ఇప్పుడు అఖండ2(akhanda2) రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ మూవీ అఖండ(akhanda)కు సీక్వెల్ గా తెరకెక్కుతుండగా డిసెంబర్ 5న అఖండ2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అఖండ సినిమాలా కాకుండా ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేసిన మేకర్స్ దాని ప్రకారమే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను చేస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ ను ముంబైలో రిలీజ్ చేయగా, సెకండ్ సింగిల్ ను వైజాగ్ లో రిలీజ్ చేశారు.
ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అఖండ2 ట్రైలర్(akhanda2 trailer) నవంబర్ 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు చింతామణి ఏరియాలో జరగనుందని, ఈ ఈవెంట్ కు కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్(sivaraj kumar) చీఫ్ గెస్టుగా రానున్నారని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సంయుక్త మీనన్(samyuktha menon), ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందించిన విషయం తెలిసిందే.






