Movies: ఈ వారం థియేటర్ రిలీజులివే!
గత వారం ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend), జటాధర(jatadhara), ప్రీ వెడ్డింగ్ షో(pre wedding show) లాంటి సినిమాలు రాగా వాటిలో ది గర్ల్ ఫ్రెండ్, ప్రీ వెడ్డింగ్ షో సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో వారం వచ్చింది. పలు కొత్త సినిమాల రిలీజులతో ఈ వారం ముస్తాబైంది. మరి ఈ వారం ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయో చూద్దాం.
దుల్కర్ సల్మాన్(dulquer salman) హీరోగా నటిస్తూ రానా(Rana) తో కలిసి నిర్మించిన సినిమా కాంత(Kantha). భాగ్య శ్రీ బోర్సే(bhagyasri borse) హీరోగా నటించిన ఈ మూవీలో సముద్రఖని(samudrakhani), రానా కీలక పాత్రల్లో నటిస్తుండగా, సెల్వమణి సెల్వరాజ్(selvamani selvaraj) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆల్రెడీ రిలీజైన కాంత ట్రైలర్(Kantha trailer) కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా, నవంబర్ 14న కాంత ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుత కాలంలోని భార్యాభర్తలు ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యతో తెరకెక్కిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు(Santhana praptirastu). సంజీవ్ రెడ్డి(Sanjeev reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రాంత్(Vikrant), చాందినీ చౌదరి(Chandni chowdary) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్(vennela kishore), అభినవ్ గోమటం(Abhinav gomatam), తరుణ్ భాస్కర్(tharun bhascker) కీలక పాత్రల్లో నటించగా, ఈ సినిమా ట్రైలర్ కు కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
హరీష్ రెడ్డి ఉప్పుల(Harish reddy uppula) దర్శకత్వంలో కృష్ణ బురుగుల(Krishna burugula), మణి వక్కా(mani vakka, ధీరజ్ ఆత్రేయ(Dheeraj athreya), రామ్ నితిన్(ram Nithin) ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ జిగ్రీస్(jigris). కృష్ణ వోడపల్లి(Krishna vodapalli) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ నవ్విస్తూనే ఆడియన్స్‌ను ఎమోషన్ కు గురి చేస్తోందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది.
వజ్రయోగి(vajrayogi), శ్రేయ భర్తీ(sreya Bharti) హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా సీమంతం(Cmantham). సుధాకర్ పాణి(Sudhakar pani) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రశాంత్ టాటా(Prasanth Tata) నిర్మించగా, గర్భిణీల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ చాలా భిన్నంగా ఉంటూనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమా కూడా నవంబర్ 14 రోజునే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కాకుండా టాలీవుడ్ కల్ట్ మూవీ శివ(Siva) నవంబర్ 14న రీరిలీజ్ కాబోతుంది. నాగార్జున(Nagarjuna) హీరోగా రామ్ గోపాల్ వర్మ(ram Gopal Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1989లో రిలీజైంది. ఆ రోజుల్లోనే మంచి హిట్ గా నిలిచిన శివ మూవీని ఇప్పుడు మేకర్స్ 4కె డాల్బీ అట్మాస్ లో రీరిలీజ్ చేస్తున్నారు.
తెలుగు సినిమాలతో పాటూ బాలీవుడ్ నుంచి ఈ వీక్ అజయ్ దేవగణ్(ajay Devgan), రకుల్ ప్రీత్ సింగ్(rakul preeth Singh), టబు(tabu) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దే దే ప్యార్ దే2(de de pyar de2) కూడా రిలీజ్ కాబోతుంది. 2019లో రిలీజైన రొమాంటిక్ ఎంటర్టైనర్ దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. మరి ఇన్ని సినిమాల్లో ఈ వారం విజేతగా నిలిచేదెవరో చూడాలి.







