Summer: ఈసారి సమ్మర్ సినిమాలివే!
సమ్మర్ లో వస్తాయనుకున్న చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara), ప్రభాస్(Prabhas) రాజా సాబ్(Raja Saab) సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో పలు మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు సమ్మర్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాని(nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అనుష్క(Anushka), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), మంచు విష్ణు(Manchu Vishnu), కళ్యాణ్ రామ్(Kalyan Ram) సమ్మర్ లో తమ లక్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు.
మార్చి 14న కిరణ్ అబ్బవరం దిల్రూబా(Dil Ruba)తో పాటూ నాని నిర్మాతగా తెరకెక్కిన కోర్టు(Court) రిలీజ్ కానున్నాయి. మార్చి 21న సప్తగిరి(Saptagiri) పెళ్లి కాని ప్రసాద్(Pelli kani Prasad), మార్చి 27న విక్రమ్(Vikram) మూవీ వీర ధీర శూరన్-2(Veera dheera Sooran2)తో పాటూ ఎల్2: ఎంపురాన్(L2:Empuraan) రిలీజ్ కానున్నాయి. మార్చి 28న నితిన్(Nithin) రాబిన్హుడ్(RObinhood), సితార బ్యానర్ మూవీ మ్యాడ్ స్క్వేర్(Mad Square) రిలీజవుతున్నాయి. మార్చి 30న సల్మాన్ ఖాన్(Salman Khan) బాలీవుడ్ మూవీ సికిందర్(Sikinder) థియేటర్లలోకి రానుంది.
ఇక ఏప్రిల్ 4న బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం(Bhairavam) రిలీజ్ కానుండగా, ఏప్రిల్ 10న సిద్దూ జొన్నలగడ్డ జాక్(Jack) తో పాటూ సన్నీడియోల్(Sunny Deol) జాత్(Jaat) మరియు అజిత్(Ajith) గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly)లు వస్తున్నాయి. ఏప్రిల్ 17కి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/o Vyjayanthi) షెడ్యూల్ అవగా, 18న అనుష్క ఘాటీ(Ghaati)తో పాటూ సుందరకాండ మరియు కేసరి చాప్టర్2 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటూ ఏప్రిల్ 25న మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa) భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.
ఇక అసలైన పోటీ మే నెలలో ఉంది. క్రేజీ సినిమాలన్నీ మే లోనే రిలీజ్ కానున్నాయి. మే 1న నేచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్(Hit3) తో పాటూ సూర్య(Suriya) రెట్రో(Retro), బాలీవుడ్ రైడ్2(Raid2) వస్తున్నాయి. మే 9న పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు(Harihara veeramallu) రానుంది. ఒకవేళ అది రిలీజవకపోతే నితిన్ తమ్ముడు(Thammudu) అదే రోజున రిలీజవుతుంది. మే 16న సింగిల్(Single), మే 21న మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ రిలీజ్ కానుండగా, మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్(Kingdom) విడుదల కానుంది.













