September: సెప్టెంబర్ పైనే అందరి ఆశలు
ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ కారణంతో వచ్చే లాంగ్ వీకెండ్ కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అయితే ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడాది కూడా ఇండిపెండెన్స్ వీక్ లో రెండు భారీ సినిమాలు వచ్చాయి. రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్న ఈ సినిమాలు అనుకున్న ఫలితాల్ని అందుకోవడంలో ఫెయిలయ్యాయి.
తర్వాత అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) పరదా(paradha), నారా రోహిత్(nara rohith) సుందరాకాండ(sundarakanda) వచ్చాయి కానీ అవి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వీటితో పాటూ పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి కానీ వాటి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. దీంతో ఆగస్ట్ 2025 భారీ నిరాశను మిగిల్చిన నెలగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడందరి ఫోకస్ సెప్టెంబర్ లో వచ్చే సినిమాలపైనే ఉంది.
సెప్టెంబర్ లో పలు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. అందులో ముందుగా అనుష్క(anushka) ఘాటీ(ghaati) సెప్టెంబర్ 5న రానుంది. ఆ తర్వాత వారం సెప్టెంబర్ 12న తేజ సజ్జ(teja sajja) మిరాయ్(mirai), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda sai sreenivas) కిష్కింధపురి(kishkindhapuri) రానున్నాయి. ఇక సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓజి(OG) సినిమా రిలీజ్ కానుంది. అంటే సెప్టెంబర్ లో రిలీజ్ కాబోయే ప్రతీ సినిమా క్రేజీ మూవీనే. అందుకే ఆడియన్స్ ఈసారి సెప్టెంబర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.













