సూర్య సినిమాలో మోహన్ బాబు
సీనియర్ నటుడు మోహన్‌బాబు కొంత విరామం తర్వాత మళ్లీ నటిస్తున్నారు. తమిళ్ హీరో సూర్య నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్రని మోహన్ బాబు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి తమిళ టైటిల్ సూరరై పోట్రు. గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. నేటి నుండి మోహన్‌బాబు పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో సాలా కదూస్, తమిళంలో ఇరుది సుట్రు పేరుతో వచ్చిన చిత్రాలకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో ఆమె రీమేక్ చేశారు.













