న్యూయార్క్ లో మెట్ గాలా ఫ్యాషన్ వేడుక
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మెట్ గాలా 2019 ఈవెంట్లో పలువురు సినీ తారలు సందడి చేశారు. ప్రతి ఏడాది మే 6న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ ఈ వేడుకని నిర్వహిస్తుంది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన వయ్యారి భామలు తమ హంసనడకలతో హల్చల్ చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండే ఫ్యాషనబుల్ వస్త్రాల్లో కనువిందు చేశారు. ప్రియాంక చోప్రా డ్రెస్ అదిరిపోయింది. రింగుల జుట్టు, సిల్వర్ రంగు గౌనులో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన భర్త నిక్ జోనాస్‌తో కలిసిఈ వేడుకలో పాల్గొంది ప్రియాంక. ఇక సిల్వర్ లైనింగ్ డిజైనర్ డ్రెస్‌లో పిసి కనువిందు చేసింది. ఇక దీపికా పదుకునే గులాబీ రంగు గౌనులో బార్పీ బొమ్మలా దర్శనమిచ్చారు. కొలనులో పింక్ కలువ విచ్చుకున్న చందంగా తన గౌనుని డిజైన్ చేసి తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ రూపంలో దీపిక అందం ఇనుమడించింది. ఇక హాలీవుడ్ బ్యూటీలు కిమ్ కర్దాషియన్, కటి పెర్రి, పెనెలోపు క్రజ్లు అందమైన డిజైనర్ డ్రెస్సుల్లో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చారు.













