ఓ పిట్టకథ ప్రీ రిలీజ్‌కు అతిథిగా మెగాస్టార్
భవ్య క్రియేషన్స్ సంస్థ కొత్తవారితో రూపొందిస్తున్న సినిమా ఓ పిట్టకథ. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లు. బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించారు. మార్చి 6న రిలీజ్ కానుంది. చెందు ముద్దు దర్శకత్వం. వి.ఆనందప్రసాద్ నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ కథను నమ్మి తీసిని సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నాం. చిరంజీవి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అన్నారు.













