Viswambhara: మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ సినిమాపైనే!
భారీ అంచనాలతో సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్(game changer) పండగ సెలవులు అవకముందే డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా విశ్వంభర వైపు మళ్లింది. వాస్తవానికి గేమ్ ఛేంజర్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి మార్చి 28న హరిహర వీరమల్లు(Harihara veeramallu) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే డేట్ కు రాబిన్ హుడ్(robinhood), మ్యాడ్ స్వ్కేర్(mad square) రిలీజ్ అవడం చూశాక వీరమల్లు రావడం లేదని క్లారిటీ వచ్చింది.
దీంతో మెగా ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ వచ్చే సినిమా చిరంజీవి(chiranjeevi) విశ్వంభర(Viswambhara)నే అవుతుంది. అయితే గత కొంత కాలంగా మెగా హీరోలు చేస్తున్న సినిమాలకు ఆశించిన ఫలితం రావడం లేదు. గేమ్ ఛేంజర్ కంటే ముందు చరణ్ చేసి ఆచార్య(Aacharya) డిజాస్టర్ అయింది. ఆర్ఆర్ఆర్(RRR) హిట్ అయినా అది మల్టీస్టారర్ కాబట్టి చరణ్ కు క్రెడిట్ ఇవ్వలేం.
వరుణ్ తేజ్(Varun Tej) ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సాయి తేజ్(Sai Tej) బ్రో(BRO) సినిమాతో యావరేజ్ గానే మిగిలిపోయాడు. వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) త్వరగా ఏదొక హిట్ కొట్టకపోతే అతని పేరుని కూడా మర్చిపోయేలా ఉన్నారు ఆడియన్స్. ఇక చిరంజీవి భోళా శంకర్(Bhola Shankar) తో ఎంత పెద్ద డిజాస్టర్ అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే మెగా ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ రాబోతున్న విశ్వంభరతో మంచి హిట్ కొడితే ఆ ఆనందంతో పండగ చేసుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక ఏ మేరకు ఫలిస్తుందో చూద్దాం.













