Mayabazaar: రీరిలీజ్ కు రెడీ అవుతున్న మాయాబజార్

టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ ఈనాటిది కాదు. గత మూడేళ్లుగా ఈ రీరిలీజుల ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. కేవలం రీరిలీజ్ మాత్రమే కాకుండా వాటికి ఎర్లీ మార్నింగ్ షోలు, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి, ఆ తర్వాత ఆ సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి అనే విషయాల గురించి కూడా చర్చించుకుని ఆయా సినిమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు.
ఆల్రెడీ చూసిన సినిమాలను కూడా ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేయడం తెలుగు ఆడియన్స్‌కే చెల్లిందని కొంతమంది ప్రశంసిస్తే, మరికొందరు మాత్రం రీరిలీజ్ కు కూడా ఇంత హడావిడి అవసరమా అంటూ విమర్శించారు. ఎన్ని జరిగినా ఫ్యాన్స్ మాత్రం వాటినేమీ పట్టించుకోకుండా రీరిలీజులను ఎంజాయ్ చేశారు. అయితే ఈ జెనరేషన్ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఓ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు రెడీ అవుతుంది.
అదే మాయాబజార్(Mayabazaar). ఈ సినిమా వచ్చి 7 దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ సినిమా ఎంతో కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ఈ సినిమా మా తెలుగు సినిమా చెప్పుకుని గర్వ పడే సినిమాగా మాయాబజార్ నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్(NTR) జయంతి సందర్భంగా ఈ నెలాఖరున మాయాబజార్ ను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.