బుల్లితెరకు సేతుపతి ఎంట్రీ…
తనదైన విలక్షన నటనతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సౌత్ లో భారీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అతను దక్షిణాదిలో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో బాలీవుడ్ లో కూడా సేతుపతి అడుగు పెట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో కత్రినా కైఫ్ కీలక పాత్రలో నటించనుందిట.
కేవలం వెండితెరపై కాకుండానే బుల్లితెరపై కూడా సేతుపతి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడట. త్వరలోనే బుల్లితెర ప్రపంచంలోకి హోస్ట్ గా అడుగుపెట్టబోతున్నారట. సన్ నెట్వర్క్ విజయ్ సేతుపతి కలిసి ఒక టెలివిజన్ షో ను ప్లాన్ చేస్తుంది. ఈ షో కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీ ఎవరు మీలో కోటీశ్వరుడు షో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ టీవీ షో ని అధికారికంగా ప్రకటించారు. సేతుపతి కూడా తన ఫాలోయింగ్ గా మైండ్ లో ఉంచుకుని తారక్ రేంజ్ లోనే తమిళ బుల్లితెరను షేక్ చేస్తాడనే అంచనా వేస్తున్నారు.













