మారుతి, గోపీచంద్ ల ‘పక్క కమర్షియల్’ కాంబినేషన్
హిట్ చిత్రాల దర్శకుడు మారుతి, మ్యాచో స్టార్ గోపీచంద్ కాంబోలో రానున్న కొత్త సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ ప్రారంభానికి ముందే చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించి సినిమాపై ఆసక్తిరేకెత్తించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీ చేస్తున్న మ్యాచో హీరో గోపీచంద్ మరో సినిమాను లైన్లో పెట్టేశారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా రూపొందనుంది. తాజాగా ఈ రోజు (ఫిబ్రవరి 14) ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ కూడా రివీల్ చేశారు. ‘పక్కా కమర్షియల్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇలా ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, బన్నీవాసు, మారుతి కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ ద్వారానే దర్శకుడు మారుతి ”భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే” వంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఈ పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ మార్చి 5వ తేదీ నుండి జరగనుందని డైరెక్టర్ మారుతి ప్రకటించారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపి సినిమాపై ఆసక్తిరేకెత్తించారు. జేక్స్‌బిజోయ్ సంగీతం సమకూర్చుతుండగా.. ఎస్కేఎన్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అంటోంది చిత్రయూనిట్. మొత్తానికైతే మొదట్లోనే ‘పక్కా కమర్షియల్’ తనదైన శైలిలో అంచనాలు క్రియేట్ చేశారు డైరెక్టర్ మారుతి.













