Manchu Dispute: విష్ణుకు సపోర్ట్ గా మోహన్ బాబు భార్య
మోహన్ బాబు(mohanbabu) ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తుల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీలోని వారే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణుకు మద్దతుగా మోహన్ బాబు భార్య నిర్మల(Nirmala) సంచలన వ్యాఖ్యల చేశారు. అసలు తప్పంతా మనోజ్(Manoj)దేనని, ఓ లెటర్ రాసి దాన్ని పోలీసులకు పంపించారు.
శనివరం రోజు విష్ణు(Vishnu), మనోజ్ ఇంట్లో గొడవకు దిగాడని, హత్యాయత్యానికి పాల్పడ్డాడని చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తన బర్త్ డే సందర్భంగా విష్ణు కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసి, తన రూమ్ లోని వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడు తప్పించి, అక్కడ విష్ణు ఎలాంటి గొడవ పడలేదని, అనవసరంగా విష్ణుపై నిందలు వేసి మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని ఆమె లెటర్ లో పేర్కొన్నారు.
అంతేకాదు విష్ణుకు గొడవ పడే స్వభావం కూడా లేదని, ఎవరినీ చిన్న మాట కూడా అనడని, లేనిపోని విషయలతో మనోజ్ కావాలని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడని ఆమె వెల్లడించింది. అంతేకాదు తమ ఇంట్లోని పని మనుషులు వారికి వారే పని మానేశారు తప్పించి, అందులో విష్ణు ప్రమేయం ఏ మాత్రం లేదని కూడా ఆమె తెలిపారు. దీంతో పాటూ జల్ పల్లిలోని ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని ఆమె పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.













