మహేష్-రాజమౌళి మూవీ అప్డేట్
మహేష్, రాజమౌళి కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తన 28వ సినిమా త్రివిక్రమ్ తో పూర్తి కాగానే, ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడు. కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే మహేష్ రాజమౌళి సినిమా ఈ ఏడాదే మొదలవుతుందనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదలవడానికి చాలానే టైమ్ పట్టనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా అయిపోవడానికే ఈ ఏడాదంతా పడుతుంది. సినిమాను 2024 జనవరికి రిలీజ్ చేస్తున్నారు. అంటే జనవరి వరకు మహేష్ ఆ సినిమా షూటింగ్ అని, ప్రమోషన్స్ అని బిజీగా ఉంటాడు. ఆ తర్వాత రాజమౌళితో సెట్స్ కు వెళ్తాడన్నమాట మహేష్.
అంతేకాదు ఇప్పటి వరకు మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరగలేదని, ఈ లోపు అది పూర్తి చేసుకుని రాజమౌళి రంగం సిద్ధం చేసుకుంటాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ గురించి నెట్ లో రోజుకో వార్త వస్తున్నప్పటికీ స్క్రిప్ట్ సిద్ధం కాలేదనేది రీసెంట్ న్యూస్. ఈ సినిమా 2026లో రిలీజ్ కాబోతుందని టాక్.













