పవన్ ఓకే చేశాడు. మరి మహేష్ ఎప్పుడు చెప్తాడో..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామా.. ఇప్పుడు అభిమానులను ఒక రేంజ్ లో ఊపేస్తోంది. వీరమల్లు మానియా ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. శివరాత్రి సందర్భంగా క్రిష్ రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన యూనిట్ మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా రానుందని గ్రాండ్ గా అనౌన్స్ చేసింది యూనిట్. అన్ని భాషలను టైటిల్స్ రిలీజ్ చేసి అద్భుత: అనిపించేశారు.
ఈ సినిమాతో పాటూ సూపర్ స్టార్ మహేష్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని వచ్చిన సర్కారు వారి పాట టీమ్ ఇప్పుడు ఇండియాలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ తో ప్రిన్స్ తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రాబోతుందా లేదా అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రచారం ప్రకారం.. సర్కారు వారి పాట ను పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించబోతున్నారని సమాచారం కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. వచ్చే సంక్రాంతి బెర్త్ ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన పవన్, మహేష్ అభిమానుల్లో అటెన్షన్ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లోనూ పోటీ పడబోతున్నారని తెలిస్తే మాత్రం హై ఓల్టేజ్ ఫైట్ చేయడం ఖాయం. మరి దీనికి సంబంధించిన విషయం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో చూడాలి.













