కీర్తి! సన్నబడితే నిన్ను చూడలేమమ్మా : మహేష్ ఫాన్స్ గోల గోల
‘మహా నటి’ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ నటీమణి సావిత్రిగా నటించి నటనలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. దాంతో పాటు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అంతలా పాపులారిటీ సంపాదించిన చిత్రం మహానటి, సావిత్రి నటించిన సినిమాలలో ఆమె ఏ చిత్రం లో కూడా జీరో సైజు లో సన్నగా కనపడేది కాదు. తెలుగింటి మహిళగా పుష్టిగా చక్కటి ఆకారం తో అందంగా కనపడేది అందుకనే మహానటి చిత్రంలో కూడా కీర్తి సురేష్ ని ఆలా చూపించారు సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కీర్తిసురేష్ మరీ యిప్పడెందుకనో సన్నపడటానికి ప్రయత్నిస్తోంది దాని వల్ల ఆమె నెక్ట్స్ సినిమాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ‘సర్కారు వారి పాట’లో ఆమె ఎలా కనిపిస్తుందోనని మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇటీవల ఆమె తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. పెద్ద హీరోలు సైతం ఆమెతో నటించేందుకు పోటీపడుతున్నారు. అయితే వచ్చిన అవకాశాలను ఆమె చేజేతులా నాశనం చేసుకుంటోంది. కమర్షియల్ చిత్రాలను తిరస్కరిస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నా అవి పరాజయం పాలవుతున్నాయి. దీనికి తోడు కీర్తి ఇటీవల మరీ బక్కగా మారిపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కీర్తి నటించిన ‘పెంగ్విన్’ భారీ అంచనాల మధ్య విడుదలైన మిస్ ఫైర్ అయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మిస్ ఇండియా’ సినిమాకి దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కాన్సెప్ట్ ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు చిత్రాల్లో కీర్తి సురేష్ లుక్స్, పెర్ఫార్మన్స్ కూడా చాలా మందికి నచ్చలేదు. గతంలో కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సడెన్‌గా జీరో సైజ్‌కి మారిపోయింది. ముఖంలో కళ కూడా కోల్పోయింది. ‘మిస్ ఇండియా’ సినిమా కోసం సన్నబడ్డానని ఆమె చెబుతున్నా.. అందులో సన్నగా కనిపించాల్సిన అవసరమైతే కనిపించలేదు ఇక అసలు విషయానికొస్తే.. కీర్తి సురేష్ తాజాగా మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కీర్తికి టైమ్ కలిసిరాకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఎక్కడ తమ హీరోపై పడుతుందోనని మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాలో కీర్తిని తప్పించి మరొకరిని తీసుకుంటే బాగుంటుందని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. లేకపోతే కనీసం తమ హీరో సినిమా కోసమైనా కాస్త బరువు పెరిగి క్యూట్ లుక్‌లోకి వస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాలు కీర్తి వరకు వెళ్లినా ఆమె మళ్లీ బరువు పెరుగుతుందని చెప్పలేం. అమ్మాయిలే అసూయపడేంత అందంతో రోజురోజుకీ మరింత గ్లామర్‌గా తయారవుతున్న మహేష్‌బాబు పక్కన కీర్తి సురేష్ ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.













