లోకేష్ ఆలోచనంతా దాని గురించే!
ఖైదీ సినిమాతో అందరూ ఒక్కసారిగా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆ తర్వాత కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. విక్రమ్ తర్వాత విజయ్ తో లియో సినిమా చేశాడు లోకేష్. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
కానీ ఖైదీ, విక్రమ్ సినిమాలకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, లియో విషయంలో మాత్రం లోకేష్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. లియో సెకండాఫ్ విషయంలో ఎంతోమంది కామెంట్ చేశారు. లియో విషయంలో వచ్చిన ఎదుర్కొన్న ఇబ్బంది మళ్లీ లైఫ్ లో ఫేస్ చేయకూడదని తన తర్వాతి సినిమా కోసం లోకేష్ ఎంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది
అందుకే రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ చేయబోయే తలైవర్171 స్క్రిప్ట్ కోసం లోకేష్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్, ప్రస్తుతం తను రజినీ171 గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. అందుకే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు చెప్పిన లోకేష్, రజినీతో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్లు చెప్పాడు. తనకు ప్రీ ప్రొడక్షన్ కోసం మరో రెండు మూడు నెలల టైమ్ ఉందని, ఈ లోగా స్క్రిప్ట్ ను బాగా డెవలప్ చేయాలని చూస్తున్నట్లు లోకేష్ తెలిపాడు. ఏదేమైనా లియో ఎఫెక్ట్ లోకేష్ కు గట్టిగానే తగిలింది.













