లోకేష్ కథకు రజినీ రెస్పాన్స్ ఏంటంటే
జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాను లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. లియో తర్వాత లోకేష్ ఈ సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి? ఎలాంటి క్యాస్టింగ్‌ను సెలెక్ట్ చేసుకోవాలనే దానిపై లోకేష్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా లోకేష్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ, రజినీతో చేయబోయే మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 2024 నాటికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవుతాయని, పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కనుందని, చాలా కాలం తర్వాత రజినీ ఇలాంటి సినిమాలో మళ్ళీ నటించబోతున్నారని చెప్పుకొచ్చాడు.
ఈ కథ విన్నాక రజినీ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారని, విన్న వెంటనే పైకి లేచి హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారని, ఆ మూమెంట్ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని లోకేష్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలుండటం, దానికి తోడు లోకేష్ ఈ విషయాలన్నీ చెప్పాక ఆ అంచనాలు మరింత పెరిగాయి.













