లోకేష్ నుంచి LCU షార్ట్ ఫిల్మ్
కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని సినిమాలకే సౌత్ డైరెక్టర్లలో టాప్ లిస్ట్ లోకి చేరిన లోకేష్ కనగరాజ్ లియో తో ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేయలేకపోయినా, కోలీవుడ్ కు మాత్రం రూ.500 కోట్ల సినిమాను అందించాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న లోకేష్, ఆ తర్వాత ఖైదీ2ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
అయితే ఈ లోపే లోకేష్ తన యూనివర్స్ లోకి ప్రధాన పాత్రల మధ్య ఉన్న రిలేషన్స్ ను కలుపుతూ ఓ షార్ట్ ఫిల్మ్‌ను తీయనున్నాడట. కేవలం 10 నిమిషాల నిడివితో తీయనున్న ఈ షార్ట్ ఫిల్మ్ లో ఢిల్లీ నుంచి లియో వరకు అందరూ తన ప్రపంచంలో ఒకరితో ఒకరు ఎలా ముడిపడ్డారన్నది వివరిస్తూ, మరికొన్ని షాకింగ్ అంశాలను రివీల్ చేయనున్నారట.
ఈ షార్ట్ ఫిల్మ్ కోసం లోకేష్ తో పాటూ ఖైదీ, విక్రమ్ సినిమాల్లో నటించిన నరేన్ కూడా భాగం కానున్నాడట. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ను సరైన టైమ్ చూసి యూట్యూబ్ లో అందరూ చూసేలా ఫ్రీ గా రిలీజ్ చేయనున్నారట. మొత్తానికి లోకేష్ కనగరాజ్ తన యూనివర్స్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు ఈ షార్ట్ ఫిల్మ్ ఐడియానే చెప్తోంది.













