లియో విషయంలో తప్పేంటో చెప్పిన లోకేష్
ఖైదీ, విక్రమ్ మూవీలతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ తర్వాత తన నుంచి ఎలాంటి సినిమా వస్తుందో అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి తోడు విజయ్ హీరో అని తెలిశాక ఆ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. కానీ లియో సినిమా ఆడియన్స్ అంచనాలను తలకిందులు చేసింది.
సినిమాకు రూ.500 కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ, ఈ సినిమాను లోకేష్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. లోకేష్ కెరీర్లో లియోనే తన వీకెస్ట్ వర్క్ అని అందరూ తేల్చి చెప్పేశారు. అయితే తన ప్రతీ సినిమాకూ ఫీడ్ బ్యాక్ తీసుకుని పని చేస్తానని చెప్పే లోకేష్, లియో విషయంలో జరిగిన తప్పును స్వయంగా తనే ఒప్పుకున్నాడు.
లియో మూవీకి సైన్ చేసినప్పుడే పది నెలల్లో మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేలా డీల్ జరిగిందని, దీంతో స్క్రిప్ట్ నుంచి ప్రతీదీ ఒత్తిడితోనే పూర్తయిందని, అందుకే అవుట్పుట్ దెబ్బతిందని లోకేష్ ఒప్పుకున్నాడు. రజినీకాంత్ తో తాను చేయబోయే సినిమా విషయంలో ఈ తప్పు జరగదని, ఈ సినిమాకు కావాల్సినంత టైమ్ తీసుకుని మరీ స్క్రిప్ట్ ను రెడీ చేస్తానని, మూవీ టేకింగ్ విషయంలో కూడా రాజీ పడనని లోకేష్ తెలిపాడు. తను చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే రజినీ మూవీతో లోకేష్ తన పనితనాన్ని మరోసారి నిరూపించుకునేటట్టున్నాడు.













