‘లైఫ్‌స్టైల్’ ప్రీ రిలీజ్ వేడుక
నెహ్రువిజయ్, రోజా, నిఖిల్, సంతోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లైఫ్‌స్టైల్. సీఎల్ సతీష్మార్క్ దర్శకుడు. కలకొండ నర్సింహ నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. మందాడి జగన్నాథం, కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సాంకేతిక మాయలో నేటి యువత చెడు అలవాట్లకు గురవుతున్నారు. కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ముఖ్యమనే అంశాన్ని చర్చించే చిత్రమిది. నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందించా. సందేశంతో ఆకట్టుకుంటుంది అన్నారు. నేటి యువత సన్మార్గంలో నడించేలా ప్రేరణనిచ్చే చిత్రమిదని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.













