‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రొమాంటిక్ ‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 8న వస్తున్నాడు
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ నుంచి ‘లెహరాయి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ పీక్స్‌లో ఉండటం యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. కెరీర్లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిత్రంలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్టోబర్ 8వ తేదీన థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ఫీల్ గుడ్ సాంగ్ ‘లెహరాయి’ రిలీజ్ చేశారు. ఎంతో అద్భుతంగా సాగిపోతున్న ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ పీక్స్‌లో ఉంది. రొమాంటిక్ జోడీగా యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేశారు. ఇక ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్ ఎప్పటిలాగే తనదైన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. గోపి సుందర్ అందించిన బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటిదాకా చూపించని డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తున్నారని టాక్. చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ డోస్ యూత్ ఆడియన్స్‌కి కిక్కివ్వబోతుందట. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి సాంగ్ ప్రోమో విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ ఛానల్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల అవుతుంది.
నటీ నటులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు..













