సుస్వర సంగీత మధుర కోయిల ఎస్ జానకమ్మ గారి గొంతు మూగబోయింది
ప్రముఖ దిగ్గజ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆమె మనవరాలు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడి, కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను ఆమె తన గాత్రంతో దోచుకున్నారు. ప్రముఖ గాయని ఎస్.జానకి దక్షిణ భారతదేశ కోకిలగా పేరొందిన ఆమె.. ఎన్నో మరపురాని పాటలు పాడి చెరగని ముద్ర వేశారు.








