ఘనంగా టిఎల్ సిఎ ఫాదర్స్ డే వేడుకలు
న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫాదర్స్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టిఎల్ సిఎ పెద్దలు, మాజీ అధ్యక్షులు, ట్రస్టీలు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా నటుడు, కమెడియన్ శివారెడ్డి హాజరయ్యారు. మరో మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ కూడా వచ్చారు. వీరిద్దరూ తమ మాటలతో, పాటలతో హుషారెత్తించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి మాట్లాడుతూ, నాన్న అనే బంధాన్ని మనం ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. మరోసారి మన నాన్నతో మనతో ముచ్చటించిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకునేలా, నాన్న అనుబంధం ఎంతగొప్పదో తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, వచ్చినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆటపాటలతో హుషారుగా సాగిన ఈ వేడుకలు విందుతో ముగిశాయి.








