కిరణ్ పాన్ ఇండియా సినిమా సంగతేంటి?
SR కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరైన కథలను ఎంచుకోకపోవడంతో తప్పటడుగులు వేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయినా దాని ముందు, తర్వాత వచ్చిన సినిమాలు డిజాస్టర్లు కావడంతో కిరణ్ మార్కెట్ మీద బాగా ప్రభావం పడింది.
అంతేకాదు, దాని వల్ల కిరణ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. దీంతో కిరణ్ కొంచెం స్పీడ్ తగ్గించాడు. త్వరలో దిల్ రుబాతో పలకరించబోతున్న కిరణ్ అబ్బవరం నిర్మాత నిరంజన్ రెడ్డితో ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడని హనుమాన్ టైమ్ లో టాక్ వచ్చింది. కొత్త డైరెక్టర్ తో రూ.30 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందన్నారు.
కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఎలాంటి ఊసూ లేదు. నిరంజన్ రెడ్డి త్వరలో సాయి తేజ్, నితిన్ తో ప్రాజెక్టులను లాక్ చేసుకునే పనిలో ఉన్నాడంటున్నారు. వీటితో పాటూ జై హనుమాన్ ఉండనే ఉంది. మరి కిరణ్ అబ్బవరంతో అనుకున్న సినిమా పోస్ట్ పోన్ అయిందా లేకా క్యాన్సిల్ అయిందా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. డెబ్యూ డైరెక్టర్ తో రిస్క్ ఎందుకనుకున్నారో ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో దిల్ రూబతో కలిసి మొత్తం మూడు సినిమాలున్నాయి. ఈ మూడింటిలో తనకు మంచి ఫలితాన్ని ఏ సినిమా ఇస్తుందో చూడాలి.













