బాలీవుడ్ హీరోయిన్ కియారా అధ్వాని కోసం ఆర్ ఆర్ ఆర్ హీరోల పోటీ?
తెల్ల తొక్క హీరోయిన్స్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనేవుంది. ప్రస్తుతం అక్కడ నుంచి హీరోయిన్లను తెచ్చుకుంటేనే తెలుగు సినిమాకు గ్లామర్ అని ఒక అభిప్రాయం ఫిక్స్ అయిపోయింది టాలీవుడ్. ఇదంతా ఓన్లీ టాలీవుడ్ కి సినిమాకె పరిమితం అయ్యింది. అదే తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి ఎంపిక చేస్తారు అక్కడి దర్శకులు. అక్కడ ఆ హీరోయిన్స్ సక్సెస్ కాగానే మన వద్దకు ఇంపోర్ట్ అవుతారు. ఇదీ మన తెలుగు సినిమా స్థాయి. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తున్నామ్. దాంతో బాలీవుడ్ జనాలకు కూడా బొమ్మ ఎక్కాలంటే కచ్చితంగా అక్కడి వారినే తీసుకోవాలి లేదంటే ప్రాజెక్ట్ వేల్యూ పడిపోతుంది అంటున్నారు అగ్ర దర్శకులు. అయితే హీరోయిన్ల్ లేనట్టు ఒకే హీరోయిన్క్ పోటీ రావడం కూడా అప్పుడప్పుడు జరుగుతూనేవుంది.
వివరాల్లోకి వెళితే…. ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత జూనియర్ ఎన్టీయార్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ నే చేయాలని అనుకుంటున్నారు. ఇక మరో వైపు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. దీంతో ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో హీరోయిన్లు అంటే అంతా బాలీవుడ్ వైపే చూస్తున్నారు. ఇక రామ్ చరణ్, సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో మూవీని దిల్ రాజు తీస్తున్నారు. ఈ మూవీ కోసం ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నారు. ఒక దశలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చింది. అయితే చివరికి ‘భరత్ అనే నేను’ హీరోయిన్ కియరా అద్వానీని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక కియరా అద్వానీ కోసం జూనియర్ ఎంటీయార్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టీమ్ కూడా గట్టిగా ట్రై చేస్తోంది అంటున్నారు ఎన్టీయార్ ముప్పై సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నారు అంటున్నారు. ఈ మూవీ కోసం కియరాను అనుకుంటే ఆమె ఇపుడు చరణ్ మూవీకి ఓకే చెప్పిందని న్యూస్ వస్తోంది. అదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రం సినిమాకు పూజా హెగ్డేని కానీ రష్మికను కానీ తీసుకుంటారు అంటున్నారు. మొత్తానికి కియరా డిమాండ్ టాలీవుడ్ లో బాగానే వుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె నటించిన ‘షేర్షాహ’ 2021 జులై 2న విడుదల కానుంది. ‘బూల్ బులయ్యా 2, జగ్ జుగ్ జియో’ షూటింగ్ జరుపుకుంటున్నాయి.













