ఆర్ ఆర్ ఆర్ లో రామ్‌చరణ్ లుక్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరంభీం, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రస్తుతం చిత్రీకరణలో దశలో ఉంది. రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. చిత్రీకరణకు కొంత విరామం చిక్కడంతో ఇటీవల హీరో రామ్‌చరణ్.. కథానాయిక కియారా అద్వానీ పుట్టిన రోజు పార్టీలో పాల్గొనడం కోసం ముంబయి వెళ్లారు. అక్కడి ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో రామ్‌చరణ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం ఆయన గుబురు మీసాలతో కనిపించడం ఆకట్టుకుంటోంది.













