ఇంతవరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు
మహేష్‌బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన బ్యూటీ కియారా అద్వానీ. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమె ఇటీవల అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌లో చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే సినిమాల్లో తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కథా నాయకుడు కొట్టే వైనం ఈ మధ్యన పెరుగుతున్నాయి. నిజ జీవితంలో ఇలా జరగడం చాలా తక్కువ. కానీ సినిమాలో కథానుగుణంగా ప్రేమికుడి చేతిలో దెబ్బలు తినడానికి తానే సిద్ధమేనంటున్న కియారా. రియల్ లైఫ్‌లో మాత్రం తనకు ఇలా జరగకూడదని కోరుకుంటానని చెప్పింది. తాను ఎవరితో నైనా ప్రేమలో పడ్డితే అతనితో ఘర్షణ పడనని పేర్కొంది ఈ భామ. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని, ఇంతవరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదని చెప్పింది కియారా అద్వానీ.













