ప్రభాస్ సరసన నిన్న దీపికా, కత్రినా.. ఈరోజు కియారా అద్వాని!
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ భారీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. అయినా ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా గ్రాఫిక్స్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమా కోసం అన్ని భాషల నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంతకాలంగా అన్వేషణ మొదలైంది. ఇప్పటికే దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వంటి టాప్ హీరోయిన్ల పేర్లు ఈ సినిమా కోసం వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ హీరోయిన్గా ఫైనల్ అయిందని తెలుస్తోంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో తన అందాలతో అలరించిన కియారా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న కియారా ఆ సినిమాతో బాగా పాపులర్ అయింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కియారా హీరోయిన్ అయితే సినిమాకి కూడా బాగా ప్లస్ అవుతుందని నాగ్అశ్విన్ భావిస్తున్నాడట
బాహుబలి తర్వాత ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సాహో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. అయితే బాలీవుడ్లో మంచి కలెక్షన్లే రాబట్టింది. ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ పైనే తన హోప్స్ పెట్టుకున్నాడు ప్రభాస్. సినీ వర్గాల సమాచారం మేరకు రాధేశ్యామ్ ప్రభాస్‌కు మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అవుతుందని అంటున్నారు. ఇక నాగ్అశ్విన్ తన సినిమా స్ర్కిప్ట్ వర్క్‌ని పక్కాగా రెడీ చేసే పనిలో ఉన్నాడు. కరోనా వైరస్ పూర్తిగా కట్టడి అయిన తర్వాతే ప్రభాస్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి నాగ్అశ్విన్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.













