Khaithi2: ఖైదీ2 వాయిదాకు కారణమతడేనా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా కూలీ(Coolie). కంటెంట్ పరంగా ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. కూలీ తర్వాత లోకేష్ చేయబోయే సినిమా కార్తీ(Karthi) హీరోగా ఖైదీ2(Khaithi2) ఉంటుందని పలు సందర్భాల్లో అతను కూడా వెల్లడించాడు.
కానీ ఇప్పుడు లోకేష్(lokesh) మనసు మారిందని, ఖైదీ2 ప్లేస్ లో రజినీకాంత్(rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) తో ఓ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సడెన్ గా రజినీ కమల్ మల్టీస్టారర్ లైన్ లోకి రావడం వల్ల ఖైదీ2 సినిమా వాయిదా పడిందని, దీనికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఖైదీ2 కు ఉన్న భారీ హైప్ ను లోకేష్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడట.
కూలీ సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్టు చెప్పిన లోకేష్, ఖైదీ2 సినిమాకు రూ.75 కోట్లు అడిగాడట. కార్తీకే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వనప్పుడు డైరెక్టర్ కు అంత భారీగా ఏం చూసి ఇస్తామని అందుకే ఖైదీ2 వెనక్కి వెళ్లిందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే లోకేష్ చాలా భారీ రెమ్యూనరేషన్ ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.