కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. కరోనా సోకినట్లు నిర్థారణ అయినట్లు కరీనా కపూర్ తెలిపారు. ఈ నటీమణులిద్దరూ కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించి ముంబయిలోని పలు పార్టీల్లో పాల్గొన్నట్టు సమాచారం. వీరిద్దరితో కాంటాక్టు అయిన వారందరూ పరీక్ష చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.