గంగూలీ బయోపిక్?
బీసీసీఐ తాజా అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవిత కథతో సినిమా రూపొందనున్నదా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సౌరభ్ గంగూలీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ బాలీవుడ్ ఘట్టాలను ఆవిష్కరిస్తూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరుణ్జోహార్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం గంగూలీకి, కరణ్జోహార్కు మధ్య పలు మార్లు చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. గుంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్‌తో కరణ్‌జోహార్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. క్రికెటర్‌గా గంగూలీ సాధించిన ఘన విజయాలతో పాటు ఎదుర్కొన్న వివాదాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిసింది.













