Kangana Ranaut: అగ్ర హీరోల సినిమాలకు నో చెప్పిన కంగన
ఏదొక విషయంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్(kangana Ranaut) ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. బీ టౌన్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా ఏదైనా సరే తనకు నచ్చితేనే చేస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడూ ఆమె సేఫ్ గేమ్ ఆడుతూ సినిమాలు చేయలేదు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే కంగన ఆ సినిమాను ఒప్పుకుంటుంది.
సినిమాలో కంటెంట్ సరిగా లేకపోవడం వల్ల తాను చాలా మూవీస్ రిజెక్ట్ చేశానని కంగనా రీసెంట్ గా చెప్పింది. రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన సంజు(Sanju) మూవీలో తనను హీరోయిన్ గా నటించమని అడగడానికి సదరు హీరోనే తన ఇంటికి వచ్చి అడిగానని, కానీ తనకు పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశానని చెప్పింది కంగనా.
అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్(Singh Is Bling) మూవీ కోసం కూడా తనను అడిగారని, కానీ ఆ సినిమాకు కూడా నో చెప్పానని కంగనా తెలిపింది. సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన బజరంగీ భాయిజాన్(Bhajarangi Bhaijhan), సుల్తాన్(Sulthan) సినిమాల కోసమని తనను సంప్రదించగా ఆ క్యారెక్టర్లు తనకు సంతృప్తిని ఇవ్వకపోవడంతో వదులుకున్నట్టు తెలిపింది. అయితే తర్వాత ఆ సినిమాలు హిట్ అయ్యాక మాత్రం సల్మాన్ ను అభినందించినట్టు చెప్పుకొచ్చింది కంగనా. ఇలా కంగనా స్టార్ హీరోల ఆఫర్లు ఎక్కువగానే వదులుకున్నట్టు చెప్పింది.













