Kangana: హాలీవుడ్ ప్రాజెక్టులో కంగన
ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్(Kangana Ranaut) నుంచి గత కొత కాలంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలేవీ రాలేదు. ఎమర్జెన్సీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా చేస్తే ఆ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయంది. ఎమర్జెన్సీ సినిమాలో కంగన నటనకు ఎంతో మంచి పేరొచ్చింది కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూలు చేయలేకపోయింది.
ఎమర్జెన్సీ(Emergency) తర్వాత కంగన నుంచి మరో సినిమా వచ్చింది లేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కంగన నెక్ట్స్ మూవీ గురించి ఓ వార్త వినిపిస్తోంది. కంగన ఓ క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసిందంటున్నారు. బ్లెస్డ్ బి ది ఈవిల్ అనే హాలీవుడ్ సినిమాలో కంగన ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. హార్రర్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీలో కంగన టైలర్ పోజీ(Tyler Posey), స్కార్లెట్ రోజ్(Scolet Rose) తో కలిసి నటించనుంది.
ఈ సమ్మర్ లో న్యూయార్క్ లో మొదలవనున్న ఈ సినిమాను లయన్ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. టైలింగ్ పాండ్(Tailing Pod), న్యూ మీ(New Me) మూవీస్ ఫేమ్ అనురాగ్ ముద్ర(Anurag Mudra) బ్లెస్డ్ బి ది ఈవిల్(Blessed Be The Evil) కు దర్శకత్వం వహించనున్నారు. పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్టు సమాచారం.






