అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా : కమల్ హాసన్
రాబోయే తమిళినాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. మధురైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సృష్టం చేశారు. అయితే ఏ నియోజవకర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం తర్వాత ప్రకటించనున్నట్లు కమల్ వెల్లడించారు. సినీ హీరో కమల్ హాసన్ మక్కల్ నీధి మయం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
మధురైలో కమల్‌హాసన్ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కమల్ పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయడాన్ని కమల్ తప్పుపట్టారు. సగం దేశం ఆకలి బాధతో ఉంటే, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరమా అని కమల్ విమర్శలు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.













